🕘 పనివేళలు & హాజరు గురించి
- ప్రతి రోజు పని టైం ఉదయం 9:00 నుంచి రాత్రి 7:00 వరకు ఉంటుంది.
- మధ్యాహ్నం 2:00 నుంచి 3:00 వరకు బ్రేక్ ఉంటుంది.
- మీరు ఏ రోజు పని చేస్తే ఆ రోజు వెబ్‌సైట్‌లో ఉన్న వర్క్ అప్డేట్ ఫారం నింపి పంపాలి.
- ఫారం submit చేయకపోతే, ఆ రోజు పని చేయలేదని అనుకుంటాం, absent గా నమోదు చేస్తాం.
- ఉదయం ఇన్ టైం మరియు సాయంత్రం అవుట్ టైం ఫారమ్స్ రెండు submit చేయాలి.
💼 మీరు చేసే ముఖ్యమైన పనులు
- మేము చేయాల్సిన ప్రధాన పనులు:
- టెలికాలింగ్ చేయడం — రీటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడడం.
- వెబ్‌సైట్ పనులు — డిజైన్, అప్డేట్, సపోర్ట్ చేయడం.
- రీటైలర్లు లేదా డిస్ట్రిబ్యూటర్ల నుండి ఫోన్ లేదా వాట్సాప్ వస్తే, రిప్లై ఇవ్వడం.
- వాళ్లు చెప్పే పని సరిగ్గా చేయాలి.
👥 టీమ్ వర్క్
- మీరు చేసిన పనిని గ్రూప్ లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలి.
- మీరు ఉన్న గ్రూప్‌లో ఉన్న 3 మందిలో పని సమానంగా పంచుకోవాలి.
- ఒకసారి పని వివరంగా చెప్పిన తరువాత, తిరిగి తిరిగి అడగకండి.
- మీరు మిగతా టీమ్ సభ్యులతో కలిసి పని పూర్తిచేయాలి.